Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 18.02.2025, (ఏపీ స్టేట్ బ్యూరో/రామిరెడ్డి): ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం సలకలవీడు గ్రామ నివాసి బిక్కా రామాంజనేయ రెడ్డి ని గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షులుగా నియామకం చేశారు. ఈ సందర్భంగా చీమకుర్తిలో ప్రకాశం జిల్లా యస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దర్శి శాసన సభ్యులు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ని వారి నివాసంలో కలిసి బిక్కా రామాంజనేయ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మీకు ఇచ్చిన బాధ్యత పార్టీకి ఉపయోగపడేలా మీ కర్తవ్యం నిర్వహించాలని సూచించారు.