Listen to this article

సెయింట్ జోసెఫ్ స్కూల్ కరస్పాండెంట్ సునీల్ ఘన సన్మానం..

జనం న్యూస్ //ఫిబ్రవరి //18//జమ్మికుంట //కుమార్ యాదవ్.. హైదరాబాద్ ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మార్షల్ ఇంటర్నేషనల్ కరెక్ట్ ఛాంపియన్షిప్ పోటీలలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సుమారు మూడు వేల మంది కరాటే విద్యార్థులు పాల్గొనగా, జన్ను కావ్య 15 -17 విభాగంలో అత్యధిక ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ పోటీలలో కటాస్ లో, బంగారు పతకం సాధించి ఈ గడ్డకు గొప్ప పేరు సుకొచ్చారు.జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మారుతి నగర్ కు చెందిన జన్ను రమేష్ కుమార్తె జన్ను కావ్య జమ్మికుంట లోని,(సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో )తొమ్మిదవ తరగతి చదువుతూ హుజురాబాద్ కు చెందిన గ్లోబల్ శోటాకాన్ కరాటే డూ ఇండియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో, కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేక శిక్షణ పొంది ప్రతి పోటీలలో అత్యంత ప్రతిభను కనబరుస్తూ పతకాలు సాధించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా మంగళవారం రోజున సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో హై స్కూల్లో కరస్పాండెంట్ సునీల్ కావ్య ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. అంతర్జాతీయ కరాటే పోటీలలో బంగారు పతకమే సాధించడమే కాకుండా ఒలంపిక్స్ లో పథకాలు సాధించాలని అన్నారు.
అదేవిధంగా ఆడపిల్ల అయినా తన కూతురు కావ్యను చదువుతో పాటు క్రీడల్లో , కరాటే రంగాలను ప్రోత్సహించిన తన తండ్రి రమేష్ ను, ప్రత్యేక కరాటే శిక్షణను ఇచ్చిన ఎస్కే జలీల్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.