

జనం న్యూస్ ఫిబ్రవరి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన 8వ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు, పథకాల పంట పండించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పట్టణానికి చెందిన విద్యార్థి ని విద్యార్థులు అందులో ఒకటి గోల్డ్ మెడల్, ఒకటి సిల్వర్ మెడల్, ఎనిమిది బ్రోంజ్ మెడల్ పథకాలు సాధించారని జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు నారన్న, రామ్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, మాస్టర్ చింతకాయల స్వామి తెలపడం జరిగింది. గోల్డ్ మెడల్ సాధించిన తోట శాన్వి, సిల్వర్ మెడల్ సాధించిన తోట శ్రీ హర్ష, బ్రోంజ్ మెడల్ సాధించిన ద్యుతి రెడ్డి, యువన్ రెడ్డి, హనియా, తన్వి హేమచంద్ర పథకాలు సాధించారు. క్రీడాకారులందరికి సిద్దిపేట జిల్లా అసోసియేషన్ తరపున అధ్యక్షులు రాంమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు మాస్టర్ స్వామి శుభాకాంక్షలు తెలపటం జరిగింది.