

అ జనం న్యూస్ ఫిబ్రవరి 18 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం. పాపన్నపేట మండలం పరిధిలో బాచారం గ్రామంలో చోటు చేసుకుంది ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథానం ప్రకారం బాచారం గ్రామానికి చెందిన కర్రెల ఆశయ్య (45) వ్యవసాయం చేసుకుంటా కుటుంబాన్ని పోషించుకుంటా ఈ నెల 15న పొలం వద్ద కింద పడగా కాలకు, నడుముకు, గాయమైంది నడవలేని స్థితిలో ఉన్న అతని ఏమి పని చేయలేదని ఆసుపత్రి వెళితే డబ్బులు ఖర్చు అవుతాయని అని భావించిన భార్య శివమ్మ, అల్లుడు రమేష్ తో కలిసి ఆదివారం అర్ధరాత్రి సమయంలో టవల్ తో గొంతుకు ఉరి బిగించి హత్య చేసింది. తర్వాత ఏడుస్తూ అశయ్య సహజంగా మరణించాడని బంధువులకు నమ్మబలికించే ప్రయతం చేసింది. కానీ శివమ్మ ప్రవర్తన పై అనుమానం వచ్చిన బంధువులు గ్రామస్తులు ఆశయ్య మృత దేహన్ని పరిశిలించగా ఆయన గొంతు వద్ద కమిలిన గాయం అనిపించింది. రాత్రి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మెదక్ రూరల్ సి ఐ రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు అనంతరం మృత దేహాని పోస్ట్ మార్ట్ నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రి కి తరలించారు. మృతుడి సోదరి గంగామణి ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసుకొని ధార్యాప్తు చేస్తునట్లు ఎస్సై పేర్కొన్నారు.