

జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మూతపడటంతో చెరుకు రైతులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని లోక్ సత్తా పార్టీ నాయకులు భిశెట్టి బాబ్జి అన్నారు. సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలించాలంటే రవాణా చార్జీలు అధికం అవుతున్నాయన్నారు. చెరుకు రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించాలని కోరుతూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో మంత్రికి వినతి పత్రం అందించారు.