Listen to this article

కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

జనం న్యూస్ 19 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వెంటనే సవరించాలని, బడ్జెట్ ను సవరించేంతవరకు వామపక్ష పార్టీలుగా ప్రజల పక్షాన పోరాడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఆశన్న అన్నారు వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ లోని వైయస్సార్ చౌరస్తా వద్ద సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ సభాధ్యాక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు పెట్టుబడిదారులపై విధించే పన్నును 22 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారని,పేదలు మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే వస్తువులపై విపరీతమైన పన్నులు విధిస్తున్నారని విమర్శించారు సంపద సృష్టికర్తలైన ప్రజలు రైతులు కార్మికులను ట్టించుకోకుండా కార్పొరేట్ శక్తులకు కేంద్రం ఊడిగం చేస్తున్నదని విమర్శించారు పేద ప్రజల ద్వారా ఆదాయాన్ని పొంది వారి కోసం ఖర్చు చేయకుండా బడా కార్పొరేట్ శక్తులు పెట్టుబడిదారీలకు రాయితీలు ఇస్తూ దేశాన్ని చుకుంటున్నారని విమర్శించారు దేశ ఆర్థిక అభివృద్ధి ముందుకు వెళ్లాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలని కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రజలకు ఉపాధి కల్పించాలని ఆ దిశగా బడ్జెట్ లో ఎటువంటి ప్రాతిపాదనలు లేవని విమర్శించారు ప్రజలకు ఉపాధి కల్పించకుండా దేశ ఆర్థిక అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలలో ధనికులపై వారసత్వ పన్నును విధిస్తున్నారని మన దేశంలో ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఉపాధిని పెంచే ఉపాధి హామీ పథకానికి మాత్రం నిధులలో కోతలు విధిస్తున్నారని విమర్శించారు కార్పొరేట్ అనుకూల ఈ బడ్జెట్ ను సవరించి విద్యా వైద్యం గ్రామీణ ఉపాధి హామీ తదితర సంక్షేమ రంగాలకు నిధుల కేటాయింపు చేంతవరకు వామపక్ష పార్టీలుగా ప్రజలకు అండగా నిలిచి పోరాడుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీపీఐ నాయకులు వివి నరసింహ ఎల్కూర్ రంగన్న వెంకట్రామిరెడ్డి చిన్న మస్తాన్ పవన్ భీముడు మాంజనేయులు నరేష్ మహేష్ రంగన్న నరసింహ తదితరులు పాల్గొన్నారుధన్యవాదాలతో వామపక్ష పార్టీలు గద్వాల