

పాటంశెట్టి సూర్యచంద్ర
ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి జనం న్యూస్ జనవరి 10 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ ప్రజా జీవితంలో గెలుపోటములు సహజమని గెలిపించినా,ఓడించినా అధికారమున్నాలేకున్నా, పార్టీఉన్నాలేకున్నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు కష్టాల్లో,సమస్యలతో ఉన్నవారికి న్యాయం జరగడం కోసం నిరంతరం ప్రజలలోనే,ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా గళం వినిపిస్తూ పోరాడుతూనే ఉంటానని పాటంశెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు. గత మూడు సంవత్సరాల నుండి ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా నాకు న్యాయం జరగలేదని పింఛన్ వచ్చేలా చేయండి అని కళ్ళు కనిపించకపోయినా ఎన్నో ఇబ్బందులతో నా మీద నమ్మకంతో ఇంజరపు రాంబాబు గారు లాంటి వారు ఎందరో ప్రతిరోజూ ఇంటికి వస్తున్నారని ఇటువంటి వారి అందరి సమస్యలు పరిష్కారం కోసం నా మిత్ర బృందంతో చర్చించి జగ్గంపేట నియోజకవర్గంలో “ప్రజా సమస్యల పరిష్కార పర్యటన” కార్యక్రమం ద్వారా త్వరలో ప్రతి కుటుంబాన్ని స్వయంగా కలుస్తానని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు