

మార్చి 9న వెంకటాపురం మండల కేంద్రంలో న్యాయ నిపుణులతో సదస్సును జయప్రదం చేయండి గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి
పిబ్రవరి 19 జనంన్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం కేంద్రంలో ఆర్ఎంబి విశ్రాంతి భవనం ఆవరణంలో ఆదివాసీ నాయకుల సమావేశం ఏర్పాటు చేసి,భద్రాచలం కేంద్రంగా ఆదిమ జాతుల కోసం,న్యాయ కళాశాల కోసం మరో న్యాయ పోరాటంలో భాగంగా మార్చి 9న వెంకటాపురం మండల కేంద్రం కాపేడ్ గ్రౌండ్ లో ఆదివాసి న్యాయ నిపుణులు,ఆదివాసీ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సదస్సును జయప్రదం చేయాలని కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా జి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ.ఏజెన్సీ ప్రాంత అడవి బిడ్డల విద్యారంగంలో ముందుకు రాణించాలని,ప్రత్యేక దృక్పథంతో సుమారు నాలుగు దశాబ్దాలుగా అడవి బిడ్డలుగా ఆలు పెరగని పోరాటాలు కొనసాగించిన ఘనత గొండ్వాన సంక్షేమ పరిషత్ దకిందని,ప్రత్యేక ఉద్యమ సంఘంగా ఆదిమ జాతులకు సేవలు అందించిన చరిత్ర జిఎస్పి కి ఉందని అన్నారు. ఆదిమ జాతుల సంక్షేమాన్ని అభివృద్ధిని మనస్ఫూర్తిగా కాంక్షించిన ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ ఏ గిరిధర్, ఐఏఎఎస్ గారు జి.ఎస్.పి పోరాటాలను గుర్తించి ఆదిమ విద్యార్థులను మరింత విద్య రంగంలో వెన్ను దన్నుగా నిలిచారని గుర్తుచేశారు.ఉద్యోగ రంగంలో ఆదివాసులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఆనాటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జీవో నెంబర్ 3 అమలు పరచాలి ప్రత్యేక కృషి చేసిన ఘనత ఆనాటి కలెక్టర్ శ్రీ ఏ గిరిధర్ గారికి తగ్గిందని వారి వల్లే భద్రాచలంలో జూనియర్ డిగ్రీ కాలేజీలలో 6%శాతం రిజర్వేషన్ నుండి జీవో నెంబర్ 267 ద్వారా 100% అమలుకు నోచుకుందని ఆయన అన్నారు.అప్పటి ఐటీడీఏ పీవో ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ గారు అప్పటి జిల్లా కలెక్టర్ వారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల భద్రాచలం ద్రంగాఆదివాసి న్యాయం కళాశాలను మంజూరు చేయాలని ప్రభుత్వ నీ మనుసు పూర్తిగా కోరుతున్నామని అన్నారు ఈ యెక్క కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి కణితి వెంకటకృష్ణ వర్కింగ్ ప్రసిడెంట్ పూనెం ప్రతాప్ బొచ్చా నర్సింహారావు కాకా శేఖర్ జయబాబు కారం రాజబాబు పర్సిక అనిల్ తదితరులు పాల్గొన్నారు