

జనం న్యూస్ ఫిబ్రవరి 19 : అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జగన్ రెడ్డి జైలు యాత్రలో భాగంగా నిన్న వంశీ ని జైలు మూలాకత్ లో కలుసుకొని బయటకు వచ్చిన తర్వాత వైసిపి నాయకులు పై కేసులు పెట్టిన పోలీసులు అధికారులందరినీ బట్టలు ఊడదీసి నడిరోడ్డుపై నిలబెడతామని, వారు పదవి విరమణ చేసినప్పటికీ సప్త సముద్రాలు వెనక ఉన్న వెతికి తీసుకువచ్చి నడిరోడ్డుపై నిలబెడతామని పోలీసులను హెచ్చరించిన పోలీసు యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడకక్కడ కేసులు నమోదు చేయాలని, జగన్ రెడ్డి మాటలపై పోలీసు సంఘాలు ఖండించడం కాదు జగన్ రెడ్డి పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత జగన్ రెడ్డిలో ఆత్మశైర్యం కోల్పోయి మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని, మొదట జైలు యాత్రలో నెల్లూరులో పిన్నెల రామకృష్ణారెడ్డిని కలుసుకొని వచ్చిన తర్వాత తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడును బెదిరించారని, అతను తెలంగాణ నుంచి వచ్చినప్పటికీ ఎక్కడ ఉన్నా, పదవి విరమణ చేసిన సప్త సముద్రాలు అవతల ఉన్న తీసుకువచ్చి శిక్షిస్తామని హెచ్చరించారని, జగన్ రెడ్డి రెండవ జైలు యాత్రలో నందిగామ సురేష్ ని పరామర్శించి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులను వదిలి పెట్టేది లేదని వారందరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతానని హెచ్చరించారని వెంకటరావు అన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అక్రమంగా అన్యాయంగా రకరకాల కేసులు పెట్టి వేధించి జైల్లో పెట్టారని, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడి చేసి ధ్వంసం చేసి ఆస్తి నష్టం కార్యకర్తలపై దాడులు చేసి రక్తం వచ్చేటట్టుగా మంగళగిరి కార్యాలయంలో, గన్నవరం కార్యాలయంలో వందల సంఖ్యలో వైసిపి నాయకులు కార్యకర్తలు చొరబడి నాశనం చేసిన విషయం మరిచిపోయి, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వెంకటరావు మండిపడ్డారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఏ పార్టీ నాయకులు కార్యకర్తలు అయినా చట్టం ముందు దోషులుగా పరిగణింపబడతారని, జగన్ రెడ్డి పై 31 క్రిమినల్ కేసులు, 11 సిబిఐ కేసులు 7 ఈడీ కేసులు లో దోషిగా ఉన్న జగన్ రెడ్డి బెయిల్ పై ఉన్న వ్యక్తి పబ్లిక్ గా నడిరోడ్డుపై అధికారులను బెదిరిస్తుంటే భారత రాజ్యాంగం, భారతదేశ చట్టాలు, న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, ఇటువంటి నొటోరియస్ క్రిమినల్ ని ఇలాగే బహిరంగంగా వదిలిపెడితే చట్ట వ్యతిరేక శక్తులు బరితెగిస్తారని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని, తక్షణమే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం జగన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని వెంకటరావు అన్నారు. జగన్ రెడ్డి ఏ ఊరు పర్యటనకి వెళ్ళిన అక్కడ పోలీసు యంత్రాంగాన్ని పోలీస్ అధికారులను బెదిరిస్తున్నారని, జగన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత శాసనసభకు ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సందర్భంగా శాసనసభ ఏరియా డీఎస్పీని బెదిరించారని, మేం అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అంతు చూస్తామని, పులివెందుల డిఎస్పి ని పులివెందులలో తన ఇంటికి పిలిపించి వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ విధంగా జగన్ రెడ్డి పోలీసులపై విరుచుకుపడటం చూస్తుంటే తన పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులను, నివారించలేక, మరో పక్క తల్లి చెల్లి జగన్ రెడ్డి పై కేసులు పెట్టడం తన పరిస్థితి అగమ్య గోచరంగా ఉండడంతో జగన్ రెడ్డి మనోధైర్యం కోల్పోయి పార్టీ కార్యకర్తలను నిలుపుకోవడానికి వారిలో ధైర్యాన్ని నింపడానికి అధికార పార్టీ పై చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పై నీచమైన మాటలతో వైసీపీ కార్యకర్తలను ఆనందపరచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని జగన్ రెడ్డిని వెంకటరావు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ పార్లమెంటు టిఎన్టియుసి కార్యదర్శి సాలాపు నాయుడు పాల్గొన్నారు.