

జుక్కల్ ఫిబ్రవరి 19 : జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సత్యా గార్డెన్స్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి “అల్ఫోర్స్” డా. వూట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించమని కోరారు. నరేందర్ రెడ్డి , విద్యావేత్తగా , సామాజిక వేత్తగా, పలు సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకు తన విద్యా సంస్థలలో ఉచిత విద్యను అందిస్తున్నారని తెలిపారు. శాసనమండలిలో పట్టభద్రుల తరపున గళం వినిపించడమే గాక, వారి సమస్యల పరిష్కారం కోసం నరేందర్ రెడ్డి గారు కృషి చేస్తారని అన్నారు.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ నోటిఫికేషన్స్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు.. విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అంకితభావంతో పని చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 27 వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి, భారీ మెజారిటీతో గెలిపించి, ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబడాలని పట్టభద్రులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు విజ్ఞప్తి చేశారు.. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ,ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ,ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ , ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ , డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ , కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..