

జనం న్యూస్ ఫిబ్రవరి 19: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కల్చరల్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ సద్భావన యాత్ర ముఖ్య అతిథి శేరి సతీష్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు చత్రపతి శివాజీ అందరి వాడు ఆదర్శ పరిపాలకుడు బిజెపి నేతలు ఛత్రపతి శివాజీని తమ నేత అనుకోవడం పొరపాటు యుద్ధ రంగంలో నిస్వార్థ పోరాట యోధుడు యుద్ధంలో ఓడిన శత్రు సైన్యాలకు సహకరించే నేత చరిత్ర తిరగ రాసిన యోధున్ని ఆదర్శంగా తీసుకోవాలి
చత్రపతి శివాజీ అందరి నాయకుడని బిజెపి నేతలు మాత్రం శివాజీ తమ నేత అని ప్రచారం చేసుకోవడం వారి స్వార్థానికి నిలువెత్తు సాక్ష్యం అన్నారు చత్రపతి శివాజీ ప్రజలకు ఎనలేని సేవలందించి ఆదర్శ పరిపాలకుడిగా సత్ప్రవర్తనతో పరిపాలన అందించారని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అన్నారు.బుధవారం చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హౌసింగ్ బోర్డ్ కాలనీలోని రమ్య గ్రౌండ్ నుండి రోడ్ నెంబర్ 1 లో జరిగిన జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమానులు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులో ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుగా చేసాయని అన్నారు. సుధీర్యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. సుదీర్ఘ కాలం యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేనివారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేసిన గొప్ప నాయకుడు అన్నారు. లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విదంగా గౌరవించబడ్డారు.అనేక మసీద్ లు నిర్మించిన హిందూ పాలకుడు.మనువాదo అమలులో లేదన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేకల మైకల్, రాజేష్ గౌడ్, లక్ష్మి, అశోక్ ముదిరాజ్, కిట్టు, రాజు, రాజు ముదిరాజ్, శ్రీధర్ చారి, బాబురావు, రామ కృష్ణారెడ్డి, సుభాష్,శివాజీ సభ్యులు రాజ్ కుమార్ జాదవ్, సురేష్ జాదవ్, మరియు భారీ సంఖ్యలో యువకులు యువతులు చత్రపతి శివాజీ అభిమానులు యన్ సి సి సభ్యులు పాల్గొన్నారు.