

జనం న్యూస్. తర్లుపాడుమండలం. జనవరి 10.
హిందూ సాంప్రదాయ పండగలలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక స్థానం ఉంది. సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రవేశించేముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. ఈరోజున మహా విష్ణువు గరుత్మంతుడి వాహనంతో మూడు కోట్ల దేవతలతో భూలోకానికి చేరుకుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈరోజు ఆచరించే పూజా. ఉపవాసం మోక్షం లభిస్తుందనేది హిందువుల నమ్మకం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మండలంలోని వివిధ దేవాలయాలు భక్తులతో కిటకిట లాడాయి. తర్లుపాడు లోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం నందు ఆలయ అర్చకులు శ్రీ కారంపూడి రమణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేశారు స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మహాలక్ష్మమ్మ అమ్మవారికి కుంకుమార్చన విష్ణు సహస్రనామ పారాయణం లలితా సహస్రనామ పారాయణం స్వామివారికి అమ్మవారికి సహస్రనామ పూజ మహా నైవేద్యం మహా మంగళహారతి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ఆలయ ధర్మకర్త జవాజి విజయభాస్కరరావు ఆధ్వర్యంలో జరిగినాయి అనంతరం స్వామివారిని అమ్మవారిని భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వాళ్లు స్వామి వారి భక్త బృందము గ్రామ ప్రజలు పాల్గొన్నారు.