

జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా బుధవారం19-2-2025 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులుగా అందోల్ నియోజకవర్గం ఎస్సీ మాజీ మండల అధ్యక్షులు గౌరగల్ల యాదగిరి నియమించడం జరిగింది. అందుకుగాను జిల్లా అధ్యక్షులు ఆదేశానుసారంగా జగదీశ్వర్, కులకర్ణి, చంద్రశేఖర్ మరియు ముత్తు రెడ్డి సీనియర్ నాయకులు కాళ్ల రాములు యాదగిరిని అల్లాదుర్గంలో ఘనంగా శాలువాతో సత్కరించారు, ఆయన మాట్లాడుతూ నాకు ఇచ్చిన పదవిని సక్రమంగా నిర్వహిస్తానని మరియు ఎలాంటి విభేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి సముచిత స్థానాన్ని ఇవ్వడం కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీకే సాధ్యమని తెలిపారు
