

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 19 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 27వ తేదీన జరిగే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మంచి మెజారిటీ దక్కేలా బాధ్యతగల స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. బుధవారం ఆయన పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. స్థానిక వికాస్ స్కూల్, విట్, కాకతీయ, చార్లెస్ స్కూళ్లలోని ప్రైవేటు ఉపాధ్యాయులతో సమావేశమైన ప్రత్తిపాటి, కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పనితీరు, వ్యక్తితం గురించి వారికి వివరించారు. ఆలపాటి అన్నివేళలా ప్రజలకోసం అందుబాటులో ఉండే వ్యక్తని, ఆయన గెలుపుతో ఉపాధ్యాయవర్గానికి మంచే జరుగుతుందని పుల్లారావు చెప్పారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జనసేనా నాయకులు తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, నెల్లూరి సదా శివరావు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, నరసింహారావు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.