

జన న్యూస్ ఫిబ్రవరి 19: నడిగూడెం వచ్చే విద్యా సంవత్సరంలో నడిగూడెంలోని కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం కళాశాల అధ్యాపకులు బుధవారం ముందస్తు ప్రచార నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న మోతె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూరిబా పాఠశాల, ఉర్లుగొండ,మామిల్లగూడెం జెడ్పి ఉన్నత పాఠశాలలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్ నాయక్ ఆధ్వర్యంలో అధ్యాపకులు ముందస్తు ప్రచారం నిర్వహించారు. కళాశాలలో ఉన్న సౌకర్యాలు పేద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేశారు.కార్యక్రమం లో అధ్యాపకులు మహేష్, కృష్ణ, ఉపేందర్, నాగరాజు, ఈశ్వర్, రవి వర్మ పాల్గొన్నారు..