

వీరుడు, శూరుడు హిందువుల పాలిట దేవుడు శివాజే
భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
జనం న్యూస్ ఫిబ్రవరి 20: ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) శివాజీ జయంతి సందర్బంగా గజ్వేల్ హైoదవ సోదరుల ఆధ్వర్యంలో కాషాయ జెండాలతో జై శివాజీ జై భవాని నినాదాలతో భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో శివాజీ వేశధారణలో కొందరు చిన్నారులు, ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. చిన్నారుల ప్రతిభకు,రామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ వీరుడు ,శూరుడు హిందువుల పాలిట దేవుడు అని అన్నారు. తిగుల్ గ్రామంలోని గాయత్రీ విద్యాలయంకు చెందిన శ్రీవర్ధన్ రెడ్డి, హర్షిత, వైష్ణవి, చరణ్, మనీష, కీర్తన, అన్విత, పృథ్వీరాజ్ విద్యార్థులు శివాజీ వేషంలో అద్భుతంగా రానించారన్నారు. అందుకే రామకోటి సంస్థ ద్వారా సన్మానించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కృష్ణవేణి, నాయిని సందీప్, గంగిశెట్టి రవేందర్, కాశబోయిన సందీప్, గోలి సంతోష్, నాగరాజు పాల్గొన్నారు.
