Listen to this article

జిల్లా అధ్యక్షులు ఇంగిలే రామారావు..

జనం న్యూస్ //ఫిబ్రవరి //18//జమ్మికుంట //కుమార్ యాదవ్.. శ్రీరాములపల్లి, ఇల్లంతకుంట, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా కేంద్రంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆరే కుల సంక్షేమ సంఘం,కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతిని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా రామారావు మాట్లాడుతూ దేశభక్తికి, దైవభక్తికి, ధైర్యానికి మారుపేరు..నవతరానికి స్ఫూర్తి ప్రదాత ఛత్రపతి శివాజీ మహారాజ్ అని దండయాత్రలను ఎదిరించి నిలిచిన యుద్ధ వీరుడు, కోట్లాది భారతీయుల స్ఫూర్తిదాయకుడు, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు,అని
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ పోరాట వీరుడికి ఇవే మా ఘన నివాళులు అని చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అదర్ సండే నాగేశ్వరరావు డివిజన్ ఇంచార్జ్ ఇంగిలే ప్రభాకర్ ఆరే సంఘం నాయకులు గుండెకారి మధు, అంబరగొండ బాపురావు,అంబరగొండ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.