Listen to this article

ఫ్రెండ్లీ వాకర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

జనం న్యూస్ ;19 ఫిబ్రవరి బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి సిద్దిపేట ఫిబ్రవరి 19: చత్రపతి శివాజీ జీవితం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సిద్దిపేట పెండ్లి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కుంభాల పద్మా రెడ్డి అన్నారు.సిద్దిపేట కేంద్రంలో సిద్దిపేట పెండ్లి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ముస్తాబాద్ చౌరస్తా నుండి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. వెంకటేశ్వర టెంపుల్ చౌరస్తాలో ఉన్నటువంటి చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పద్మా రెడ్డి మాట్లాడుతూ శివాజీ ఎదురులేని, తిరుగులేని, ఓటమి ఎరుగని వీరుడు శివాజీ అని ఆయన సేవలను గుర్తు చేశారు.మొగల్ సామ్రాజ్యాన్ని గడ గడ లాడించి, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు, భవానీ మాత పరమ భక్తుడు చత్రపతి శివాజీ అని అన్నారు.సనాతన ధర్మ పరిరక్షకుడు, సర్వ మానవాళికి దిక్సూచి చత్రపతి శివాజీ అని కొనియాడారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జైపాల్ రెడ్డి, బొమ్మల యాదగిరి, యాదగిరి గౌడ్ చుక్క చంద్రం. శ్రీనివాస్ గౌడ్ జీవన్ రెడ్డి పల్లి భాస్కర్ గౌడ్ జేడీ లక్ష్మీనారాయణ గౌడ్ తిమ్మసారం దుర్గయ్య వనం స్వామి లు పాల్గొన్నారు.