

జనం న్యూస్ 19 ఫిబ్రవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి) ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో మధ్యాహ్నం 2:30 గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై ఏ ప్రవీణ్ కుమార్ తమ సిబ్బంది తో కలిసి కోతులనడుమ రైతు వేదిక దగ్గరలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం రాగ అక్కడికి వెళ్ళగా అక్కడ ఏడుగురు పేకాట ఆడుతూ కనిపించగా అందులో ఆరుగురు వ్యక్తులు దొరికినారు మరోక వ్యక్తి పారిపోయినాడు దొరికిన వారి వివరాలు1) సల్ల రాజు ,s/o ఐలయ్య R/o తోకలపల్లి 2) పండ్రాలబిక్షపతి S/o రాజయ్య R/o హుజురాబాద్ 3). బండ రాజయ్య S/o రాజవీరుR/o హుజురాబాద్ 4). పల్లెబోయిన రవి s/o మల్లయ్య R/0 కోతుల నడుమ 5). కాశరాజు S/o కుమారస్వామి R/o కోతుల నడుమ6) కొమ్మరాజు మల్లయ్య S/o వెంకటయ్య వీరు ఆరుగురు దొరకగా వీరి వద్ద నుండి 3070 రూపాయల నగదు మరియు 3 సెల్ ఫోన్లు, 1 ఆటో,2 టూ వీలర్స్,పేక ముక్కలు. స్వాధీనపరచుకోనైనది మరోక వ్యక్తి అక్కడి నుండి పారిపోయినాడు అతని వివరాలు తెలుసుకోగా అతని పేరు 7)శ్యామ్ R/o హుజురాబాద్ అని తెలిసినది,ఇట్టి దాడిలో ఎల్కతుర్తి ఎస్ఐ ఏ ప్రవీణ్ కుమార్ మరియు ప్రొబేషనరీ ఎస్ఐ గోవర్ధన్,హెడ్ కానిస్టేబుల్ విటల్ రావు,పీసీ భాస్కర్ రెడ్డి,మరియు హెచ్ జి వీరస్వామి,పాల్గొన్నారు.
