Listen to this article

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు

జనం న్యూస్ పీబ్రవరి 10: ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నందు మత్తు పదార్థాలు ( డ్రగ్స్, గంజాయి) , పిడిఎస్ బియ్యం, పశువులను అక్రమంగా తరలించడం, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక రవాణా చేయడం లాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలు ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై ఉక్కు పాదం మోపాలని సంబంధిత పోలీస్ అధికారులకు ప్రకటన ద్వారా ఎస్పీ తెలిపారు. ఇటీవల సిర్పూర్ టి మండలం ఉడిక్కిలి చెక్ పోస్ట్ వద్ద 208 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యంను తరలిస్తున్న కేసులో 12 మంది నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపడం జరిగిందని ఎస్పీ తెలిపారు. జిల్లాలో 2024 నుండి ఇప్పటి వరకు అక్రమ పిడిఎస్ బియ్యం తరలింపులో 124 కేసుల్లో 1594 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు, 214 మంది రిమాండ్ కాబడ్డారని, అక్రమ పశువుల తరలింపులో 2024 నుండి ఇప్పటివరకు 63 కేసుల్లో 208 మంది రిమాండ్ కాబడ్డారని , 917 పశువులను రక్షించినట్లు ఎస్పీ తెలిపారు. పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేయడం , గంజాయి మొక్కలు నాటడం ,వాటిని సరఫరా చేయడం, అక్రమంగా ఇసుక రవాణా చేయడం, పశువులను అక్రమంగా తరలించడం లాంటి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడవద్దని , అక్రమాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోని, అలవాటు పడిన నేరస్తులపై పీడి ఆక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లయితే ఆ సమాచారంను డయల్ 100 గానీ సంబంధిత పోలీస్ స్టేషన్ నందు గాని తెలియజేయాలని అన్నారు.