

జనం న్యూస్ ఫిబ్రవరి 19: చిలిపిచేడు మండల ప్రతినిధి లక్ష్మణ్ రాజు మెదక్ జిల్లా బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చిలిపి చెడు మండలంలో ఫైజాబాద్ గ్రామములో శివ స్వాములు శివ దీక్ష పూర్తి చేసుకొని ఫైజాబాద్ హనుమాన్ దేవాలయం నుండి 19 మంది శివ స్వాములు కాశీ యాత్రకు బయల్దేరుతున్న సందర్భంగా స్వాముల ఇరుముడి కట్టుకొని శివ స్వాములు బయలుదేరారు. ఈ సందర్భంగా జ్యోతిర్ముడి ఆంజనేయులు గురు స్వామి ఆధ్వర్యంలో .అంతి రెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఫైజాబాద్ గ్రామములోని పుర వీధుల గుండ పాదయాత్రలో భాగంగా శివ నామస్మరణ చేస్తూ ప్రాథమిక పాఠశాల వరకు వెళ్ళారు . శివ స్వాములు వెళ్లే మార్గంలో మంగళ హారతులు ఇస్తూ నీటి సాకలతో ఘన స్వాగతం పలికారు. ఫైజాబాద్ గ్రామం గల్లి గల్లి శివ నమః స్మరన్నతో మారు మోగింది ఈ కార్యక్రమంలో హత్నుర గ్రామ గురు స్వాములు వివిధ గ్రామాలకు చెందిన గురుస్వామి పాల్గొన్నారు భజన మండలి భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శివ స్వాములను కాశీ కి సాగనంపడం జరిగినది