Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 20, పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాని కి సత్యనారాయణ రావు పూలమాలవేసి బుధవారం రోజున ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా అధ్యక్షుడు పల్మారు రమేష్, ఉపాధ్యక్షుడు సట్టా తిరుపతి ట్లడుతూమరాఠా యోధుడు,జాతి వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ మహాయోధుడికి ఘనంగా నివాళులు అర్పింస్తున్నమని,మొఘలుల బారి నుండి భారతదేశాన్ని కాపాడటంలో శివాజీ మహరాజ్‌ చేసిన పోరాటం మరువలేనిదని, ధైర్యసాహసాలకు ప్రతీకగా శివాజీ నిలిచారని,ఆనాడు శివాజీ మహారాజ్ చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలు నేటి యువతరానికిమార్గదర్షణీయమని, ఇంతటి మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నన్ను బాగస్వాముడిని చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, బిజెపి పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.