Listen to this article

జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా 19 : ఫిబ్రవరి 2025 ప్రతినిధి నాగరత్నం అల్లాదుర్ మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ గ్రామంలో చత్రపతి శి వాజి మహారాజ్ 395 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలోగ్రామ పెద్దలు,యువకులుపాల్గొని హనుమాన్ చౌరస్తా నుండి గ్రామ వీధులలో శివాజీ మహారాజ్ చిత్రపటంతో యువత బైక్ ర్యాలీని శివాజీ మహారాజ్ కి జై అనే నినాదాలతో 161 వ జాతీయ రహదారి వద్ద ఉన్న కమాన్ వరకు ర్యాలీని నిర్వహించారు.యువత చత్రపతి శివాజీ గా ఖ్యాతి పొందిన శివాజీ రాజ్ బోస్లే 1674 జూన్ 6న రాయగడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ చత్రపతి అనే బిరుదుని ప్రధానం చేశారు. సాధారణంగా చత్రపతి అంటే రక్షకుడు అని అర్థం.శివాజీ మహారాజ్ హిందూ ధర్మాన్ని,హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్ర గన్యుడిగా పేరుగాంచిన వీరుడు అని వ్యక్తపరిచారు