Listen to this article

జనం న్యూస్ 20: ఫిబ్రవరి 2025. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్ జైనూర్ :క్షయ వ్యాధి నిర్ములన కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల క్షయ వ్యాధి సూపర్వైజర్ సంతోష్ అన్నారు. బుధవారం అయన మండలం లోని పోచంలోద్ది కేజీబివి పాఠశాల లో ఉషేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబందితో కలిసి విద్యార్థులకు క్షయ వ్యాధి గురించి, నివారణ చర్యల గురించి,తీసు కోవలసిన పౌష్టికహారం గురించి అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో హెచ్ ఇ ఓ జదవ్ రమేష్, హెల్త్ సూపర్వైజర్ ఉమ రాని, కెజీబివి ప్రిన్సిపాల్ సుమలత, ఏఎన్ఎం భారతి, హెల్త్ అసిస్టెంట్ జంగు, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.