

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 20 రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి సోమవారం సాయంత్రం అశేష భక్తజన సంద్రం నడుమ స్వామి వారి ఉత్సవ విగ్రహాలు అతని భార్యలు ఒకవైపు రుక్మినమ్మ మరొకవైపు సత్యభామ తో రధం పై కొలువుతీరి విహరించారు, ఉభయ దాతలు మండల అధికారులు దర్శి డిఎస్ పి బి లక్ష్మినారాయణ తహసీల్దార్ యూ విజయ భాస్కర్, విద్యుత్ డిఈ నాగేశ్వరరావు,ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదమంత్రోచ్చరణ నడుమ భాజాభజంత్రీల తో భక్తులు రథంపైకి ఉత్సవమూర్తులను భక్తులు అందజేశారు,అనంతరం ఈఓ ఈదుల చెన్నకేశవరెడ్డి, ఆలయ ఆణువంశిక ధర్మకర్తల జవ్వాజి విజయభాస్కర రావు పచ్చ జెండా ఊపి రధోత్సవం ను ప్రారంభించారు,యువకులు రథం ను లాగుచుండగా, వేలాది మంది భక్తులు మాడ వీధులకు ఇరువైపులా నిల్చొని రధోత్సవం ను కన్నులారా తిలకించారు, చుట్టూ పక్కల జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన భక్తులతో తర్లుపాడు వీధులన్నీ జనసంద్రంగా మారాయి.మార్కాపురం టిడిపి నాయకులు కందుల నారాయణ రెడ్డి,గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, శ్రీశైలం వాసవి సత్రం సభ్యులు పోలేపల్లి జనార్దన్, ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, టిడిపి నాయకులు ఉడుముల చిన్నపరెడ్డి ఈర్ల వెంకటయ్య, కాళంగి శ్రీనివాసులు,గోసు వెంకటేశ్వర్లు,స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు,తహసీల్దార్ వారి సిబ్బంది,ఆణువంశిక ధర్మకర్తలు జవ్వాజి విజయభాస్కర రావు,సర్పంచ్ పల్లెపోగు వరాలు, ఎంపీటీసీ వన్నెబోయిన అంకమ్మ,సూరెడ్డి సుబ్బారెడ్డి,మేకల వెంకట్, కుందురు శ్రీకాంత్,కొలగట్ల విజయ భాష్కర్ రెడ్డి,గౌతుకట్ల సుబ్బయ్య, ఈర్ల పెద్ద కాసయ్య,వాడేల కృష్ణప్రసాద్ ,దోగిపర్తి మల్లిఖార్జున, కుందురు చిన్నకాసిరెడ్డి, పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు,స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చకులు రమణాచార్యులు, ఆగమనాచార్యులు లక్ష్మణ తిలక్ , కారంపూడి సాయి మోహన్,శాస్త్రోత్తముగా పూజలు నిర్వహించారు, స్వామి వారిని విశేషా అలంకరణ ను కూనపులి రమణయ్య అలంకరణ చేశారు,సాయంత్రం 5.15 నిమిషాలకు బయలుదేరిన రథం 6.30 నిమిషాలకు యధా స్థానానికి చేరుకుంది,ఉభయదాతలుగా క్రి. శే వాడేల వెంకట సుబ్బయ్య ధర్మపత్ని సుందరమ్మావీరి కుమారులు దాత్తాత్రేయ శ్రీనివాసులు, వెంకట రమణ,క్రి. శే వాడేల సుబ్బారామయ్య ధర్మపత్ని సత్యవతి వీరి కుమారులు ప్రకాశరావు, సుబ్బారావు, సుధాకర్, క్రి. శే జవ్వాజి లక్ష్మిసుబ్బయ్య శ్రేష్టి ధర్మపత్ని క్రి. శే ఈస్వరమ్మా వీరి కుమారులు జవ్వాజి భాస్కర రావు ధర్మపత్ని శేషకుమారి వీరి కుమారులు జవ్వాజి సాయి కృష్ణ వ్యవహారించారు,దర్శి డియస్పి బి లక్ష్మినారాయణ నేత్రుత్వంలోపొదిలి సిఐ టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ ఐ బ్రాహ్మనాయుడు పర్యవేక్షణలో అయిదు మంది ఎస్ఐ లు పొదిలి ఎస్ ఐ వేమన దొనకొండ ఎస్ఐ త్యాగరాజు, కొనకలమిట్ల ఎస్ ఐ రాజ్ కుమార్ మార్కాపురం ఎస్ ఐ రాజమోహన్, ఒంగోలు స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ పాపిరెడ్డి, ఎస్ఐ సుబ్రహ్మణ్యం,80 మంది సిబ్బంది తో పటిష్ట బందోబస్తూ నిర్వహించారు రధోత్సవం అనంతరం దర్శి డి యస్ పి,పొదిలి సి ఐ , తర్లుపాడు ఎస్ ఐ ని ఈఓ ఈదుల చెన్నకేశవ రెడ్డి, ఆణువంశిక ధర్మకర్త జవ్వాజి విజయభాస్కర రావు, స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం శేష వస్త్రాలతో పూలమాలతో సత్కరించారు,తర్లుపాడులో రధోత్సవం సందర్బంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం తర్లుపాడు టిడిపి, పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాటకచేరి నిర్వహించారు ఈ కార్యక్రమం లో భక్తులు పలుప్రాంతాల నాయకులు అధికారులు పాల్గొన్నారు
