

జనం న్యూస్- ఫిబ్రవరి 20: నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్లో బిజెపి పార్టీ టౌన్ అధ్యక్షులు గణేష్ తంగరాజు ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గణేష్ తంగరాజు మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు కృషి చేసిన బహుజన చక్రవర్తి శివాజీ మహారాజ్ అని కొనియాడారు, హైందవ ధర్మాన్ని కాపాడుతూ మొగల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని విజయం సాధించారని హిందూ స్వరాజ్య స్థాపన కోసం పాటుపడ్డ శివాజీ ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు, ఈ కార్యక్రమంలో గణేష్ తంగరాజు, మున్నా, నాగార్జున, మైనార్టీ నాయకులు మహమ్మద్ గని ఎస్సీ నాయకులు ఆదాసు విక్రం, మురళి, యోహాను, సాయినాథ్ గుప్తా, శివ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.