Listen to this article

జనం న్యూస్ జనవరి 11 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఖానాపూర్ క్రికెట్ లీగల్ 3మ్యాచ్ ప్రారంభించిన నిర్మల్ జిల్లా ఎస్పీ జి.జానకి షర్మిల ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. యువత మంచి మార్గాన్ని పెంచుకొని భవిష్యత్తులో తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. తర్వాత క్రికెట్ మ్యాచ్ జెండా ఎగురవేసి ప్రారంభించారు. మరియు క్రికెట్ ఆడే వారిని పరిచయం చేసుకున్నారు.తదనంతరం క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐ సైదారావు ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ మరియు ఈ యొక్క క్రికెట్కు దాతలుగా నిలిచిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం తోట సుమిత్. సాయికుమార్. సోహెబ్ అంకం మహేందర్ఈ యొక్క కార్యక్రమానికి విజేత స్కూల్ విద్యార్థులు ఎస్పీ కి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో 10 క్రికెట్ జట్లు పాల్గొనడం జరిగింది.