Listen to this article

టి ఆర్ ఆర్ ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్..

జనం న్యూస్ 20 ఫిబ్రవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైన నాయకుడు సుకినె సంతాజీని తెలంగాణ రైతు రక్షణ సమితి(టీ ఆర్ ఆర్ ఎస్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. గత ప్రభుత్వంలో ఆరె కులస్తుల కోసం హైదరాబాద్ లో కేటాయించిన భూమి రక్షణకు సంతాజీ శక్తి వచన లేకుండా కృషి చేశారని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వద్దకు సమస్యను తీసుకెళ్లి రూ.కోట్ల విలువైన భూమిని కాపాడిన కార్యదక్షుడు సంతాజి అని కొనియాడారు.సంతాజి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆరే సంక్షేమ సంఘం నాయకులు ఆకాంక్షించారు.సన్మాన కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం నాయకులు సుకినె సుధాకర్ రావు,అంబిరు శ్రీనివాస్, హింగే రవీందర్, ఎనకమూరి బిక్షపతి, బూర్గుల రామారావు,కరట్లపల్లి నగేష్,కదం రాజు, బిజెపి ఎల్కతుర్తి మండల అధ్యక్షులు మంతుర్తీ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.