

జనం న్యూస్ ఫిబ్రవరి 20: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం, బుచ్చయ్య పేటకు చెందిన సయ్యపురెడ్డి సావిత్రి క్యాన్సర్ వ్యాధికి గురై ఆర్థిక సహాయం కొరకు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ ను అభ్యర్థించగా, ఆమె వైద్య ఖర్చుల కోసం సహాయం అందించ వలసిందిగా ప్రధాన మంత్రికి ఎంపీ లేఖ వ్రాసి, ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేయించారు.
పి.ఎం.ఆర్.ఎఫ్. నుంచి మంజూరు చేసిన మూడు లక్షల రూపాయల నగదును సావిత్రి చికిత్స చేయించు కుంటున్న విశాఖపట్టణంలోని ఆసుపత్రికి ఆన్లైన్ ద్వారా నేరుగా జమ చేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులు ఎంపీ రమేష్ కు లేఖ డ్వారా తెలిపారు. వైద్య ఖర్చుల నిమిత్తం పిఎం సహాయ నిధి నుంచి సహకారం అందించిన ఎంపీ డా. సి.ఎం. రమేష్ కు సావిత్రి, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.//