Listen to this article

మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు

జనం న్యూస్ ఫిబ్రవరి 21: (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు మునగాల మండల పరిధిలోని ముకుందాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన కంప్యూటర్,ప్రింటర్ ను గురువారం మండల విద్యాధికారి పిడతల వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మేడ్చల్ డీసీపీ నంద్యాల కోటిరెడ్డి సహకారంతో ముకుందాపురం గ్రామ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారు పాఠశాలకు కంప్యూటర్, ప్రింటర్ అందించినట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు రవాణా సౌకర్యం కోసం ఆటో నీ ఏర్పాటు చేయడం, పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. పాఠశాల అభివృద్ధికి ఎంప్లాయిస్, గ్రామస్తుల సహకారం ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు హనుమంతరాజు, పందిరి బ్రాహ్మరెడ్డి,నర్రా ఎల్లా రెడ్డి, గ్రామస్తులు కోటిలింగం, అంజి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.