Listen to this article

జనం న్యూస్ //ఫిబ్రవరి //20//జమ్మికుంట //కుమార్ యాదవ్. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించిన, బాలికల మరియు బాలురు, కోరపెల్లి అధ్యాపకుల బృందం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల విద్యాధికారి,ఎం హేమలత మరియు జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి , ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎం హేమలత మాట్లాడుతూ.. నేటి బాలురే రేపటి భావి భారత పౌరులని, విద్యార్థి దశలోనే పిల్లలు మంచి మార్గంలో నడవాలని అన్నారు. మన చుట్టూ జరుగుతున్న కొన్ని అనాయుత కార్యక్రమాలపై విద్యార్థులకు మంచి అవగాహన కల్పించాలని సూచించారు. యువత ముఖ్యంగా డ్రగ్స్ మరియు గంజాయి ఇలాంటి మాదకద్రవ్యాయలకు అలవాటు పడకుండా కాపాడుకోవాలని, ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ బాధ్యత మన అందరి పైన ఉందని, అలాంటి కార్యక్రమాలపై యువత ఎప్పుడూ ముందుండి మంచి మార్గంలో నడిపించాలని, మంచిగా చదువుకొని, మంచి పేరు తెచ్చుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ సీఐ వరగంటి రవి మాట్లాడుతూ.. పట్టణంలో జరుగుతున్నటువంటి, అసాంఘిక కార్యక్రమాలలో, ముఖ్యంగా వినిపించేది,మాదక ద్రవ్యాలు డ్రగ్స్, గంజాయి లాంటివి, చాప కింద నీరు లాగా, పట్టణం నుండి పల్లెటూరికి చేరుతున్నాయని, మాట్లాడారు. ముఖ్యంగా జమ్మికుంటలో రైల్వే స్టేషన్ ఉండడంవల్ల, మహారాష్ట్ర లాంటి సిటీ నుండి జమ్మికుంటకు, గంజాయి మదకద్రవ్యాలు సులువుగా రవాణా చేసుకొని, విద్యార్థులని టార్గెట్ గా చేసుకొని, చెడు వ్యసనాలకు అలవాటు చేస్తున్నారని, అన్నారు. ముఖ్యంగా ఇలాంటి కేసులు ఎన్నో మా దృష్టికి వచ్చాయని, గంజాయి అలవాటు పడిన వ్యక్తి ఎంతటి నేరానికైనా వెనకాడబోడని, ఆ మత్తులో ఏం చేస్తున్నాడు అతనికి అర్థం కాని పరిస్థితిలో ఉంటారని వివరించారు. డ్రగ్స్ కు బానిసైతే జీవితమే నాశనం అవుతుందని,ఈ అలవాటు ఉన్న వ్యక్తి అనేక రోగాలకు గురై మరణిస్తారని, విద్యార్థులు ఎలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని, ఎల్లప్పుడూ మంచి మార్గంలోనే నడవాలని సూచించారు. చదువు కన్నా గొప్పది ఏదీ లేదు అని, మంచిగా చదువుతే మనం మంచి ఉద్యోగాలు సంపాదించుకొని, గొప్ప స్థాయిలో ఉండాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని వివరించారు .