

జనం న్యూస్, ఫిబ్రవరి 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఢిల్లీ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఆర్యవైశ్య మహిళ రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని బిజెపి సీనియర్ నాయకుడు బుద్ధ మహేందర్ గుప్త అన్నారు, గురువారం సిద్దిపేట జిల్లా జగదేవ పూర్ మండల కేంద్రంలో బిజెపి సీనియర్ నాయకులు బుద్ధ మహేందర్ గుప్త,మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలోనే అందరికి న్యాయం జరుగుతుందని, భారత ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆర్యవైశ్యులకు బిజెపిలో మంచి గుర్తింపు ఉంటుందని, కష్టపడ్డ కార్యకర్తలకు బిజెపి పార్టీలోనే గుర్తింపు ఉంటుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని, బి ఆర్ ఎస్, పార్టీ , కాంగ్రెస్ పార్టీ మాటలకే పరిమితమయ్యాయని, ప్రజా సంక్షేమ పాలన బిజెపికే సాధ్యమని, ప్రజలు బిజెపి వైపు ఉన్నారని అన్నారు. తెలంగాణలో రాబోయే కాలంలో బిజెపి అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు