

జనం న్యూస్ //ఫిబ్రవరి //20//జమ్మికుంట //కుమార్ యాదవ్.. నిజాయితీ పరుడు అయినా , సేవా తత్పరుడు ఐనా ప్రసన్నా హరికృష్ణకు అండగా నిలవండి, అంటూ జమ్మికుంటలో గొడిశాల రమేష్ డివిజన్ ఇంచర్చ్ అధ్వర్యంలో, ఎర్ర శ్రీధర్, గదేపాక కుమార్ రాజా, మిడిదొడ్డి విజయ్, అంతడుపుల శ్రీనివాస్, మిదిదొడ్డి రమేశ్, మాచర్ల శ్రీనివాస్, ప్రశాంత్, ప్రవీణ్, ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీగా గెలిస్తే ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించిన కరపత్రాన్ని పట్టభద్రులకు, ఉద్యోగ ఓటర్లకు పంచుతూ ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలుపాలని కోరారు. 19 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రాజీనామా చేసి ప్రజాసేవకు అంకితమై రూపాయికే ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో చేదోడువాదోడుగా అండగా నిలిచారన్నారు. కొందరు విద్యా వ్యాపారంగా భావించే వారికి బుద్ధి చెప్పాలంటే నీతి నిజాయితీతో ప్రజాసేవ చేసేందుకు ఎమ్మెల్సీగా ముందుకు వచ్చిన ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలిపాలని వారు కోరారు. జమ్మికుంట పట్టణంలోని వాకర్స్ మైదానం వద్ద జిమ్ ల వద్ద, వ్యాపార కూడలిల వద్ద నిరుద్యోగులను, పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థించారు. కాగా వారి ప్రచారానికి ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్రుల నుండి విశేష స్పందన లభిస్తుంది అన్నారు.
