

జనం న్యూస్ ఫిబ్రవరి 20 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. ఈ రోజు పాపన్నపేట మండలం లోని మల్లంపేట్ గ్రామం లో శివ స్వాములు ఎంతో భక్తి శ్రద్దలతో వారు మండలం కాల దిక్ష ను పూర్తి చేసుకొని ఈ రోజు ఉదయం శ్రీ రామాలయం లో ఇరుమూడీలు కట్టుకొని ఆ శ్రీశైలా మల్లన్న స్వామి దర్శనం కొరకు బయలుదేరారు, ఈ కార్యాక్రమం లో శివ స్వాములు వారి కుటుంబ సభ్యులు మరియు బంధువులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామాలయం నుండి రేణుక ఎల్లమ్మ దేవాలయం వరకు ఓం నమశ్శివాయ అనే నామం తో కీర్తనలు చేసుకుంటూ శివ స్వాముల యాత్ర కు తరలివెళ్లారు.
