Listen to this article

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా పెద్దగట్టు…

బేరిల చప్పులతో, శివ సత్తుల విన్యాసాలతో, ఓలింగా…. నామ స్మరణతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు. జనం న్యూస్ ఫిబ్రవరి 21 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) చివ్వేంల మండలం దురాజ్ పల్లిలో మాఘ మాసంలో ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన పెద్దగట్టు జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్,మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తిస్ ఘడ్ రాష్ట్రాల నుండి కులమతాలకు అతితంగా ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు. దేవతమూర్తులతో కూడిన దేవరపెట్టే . జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం కేసారం నుండి దేవరపెట్టె తరలింపు.దీనినే అందనం పెట్టె, అందనపు సౌడమ్మ పెట్టె, లింగమంతుల స్వామి చౌడమ్మ పెట్టె అని పిలుస్తారు.మహబుబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామానికి చెందిన బైకాని వంశస్థుల ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో తంతు జరిపించారు. ఈ దేవరపెట్టెలో యాదవులు ఆరాదించే 33 దేవతా గణం ఉంటారు. వారు చౌడమ్మ, గంగ, యలమంచమ్మ, ఆకుమంచమ్మ, మాణిక్యమ్మ 5 గురు రాజులు, 5 చెంచులు భూమి నేడు, భూసాని వినాయకుడు, బ్రహ్మ, వారావహతారం లింమంతుల స్వామి అంబారిపై పాపాణాక్షి నాగేంద్రుడు ఉంటారు.

మొదటి రోజు దేవరపెట్టే తరలింపు….

పిబ్రవరి 16 ఆదివారం అర్ధరాత్రి కేసారం గ్రామంలో దేవరపెట్టె తరలింపుకు ముందుగా మెంతబోయిన వంశస్థులకు చెందిన దేవరగుడిలో దేవర పెట్టెను అలంకరించారు. వీరు మెంతబోయిన, మున్న, గోర్ల వార్ల సహకారంతో దేవరపెట్టెకు పూజలు నిర్వహించారు.బైకానులు బేరీలు, డప్పు చప్పుళ్లతో కథానానం రూపంలో లింగమంతులు, చౌడమ్మలను ఆరాధిస్తూ మెంతబోయిన గోర్ల వంశీయులతో దీపారాధన చేసి పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్యన ఓ లింగా ఓ లింగా నామస్మరణతో పాదయాత్రగా పెద్దగట్టుకు చేరుకొని
సంప్రదాయం ప్రకారం యాదవుల హక్కుదారులైన మున్న, మెంతబోయిన వంశానికి చెందిన ప్రతిమ ఇంటి నుంచి మహిళలు మంద గంపలను మోసుకుంటూ జాతరకు బయలుదేరినారు. వీరు దేవరపెట్టె ఊరేగింపుతో పాటు గంపలను ఎత్తుకొని వచ్చి లింగమంతుల స్వామి చౌడమ్మ దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వీరు పూజలు నిర్వహించిన తర్వాతనే మిగతా కులాలకు చెందిన భక్తులు గంపల ప్రదర్శనలు చేశారు.

రెండవరోజు చౌడమ్మ తల్లికి బోనం సమర్పణ…

యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ శ్రీ లింగమంతుల స్వామి వారి జాతరలో రెండో రోజు చౌడమ్మ తల్లికి భక్తులు సాంప్రదాయరీతిలో బోనాలను అత్యంత వైభవంతో సమర్పించారు.ప్రభుత్వం సూచనల మేరకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశానుసారం పెద్దగట్టు జాతర నేపథ్యంలో తెలంగాణ తోపాటు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,ఛతీస్ ఘడ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ లకు చెందిన ప్రజలు కుల మతాలకు అతీతంగా శివసత్తుల నృత్యాలతో,పూలు పసుపు, కుంకుమతో పూజించిన గంపలతో,డప్పు దరువుల శబ్దాలకు నృత్యలు చేస్తూ ,ఓలింగా నామస్మరణాలతో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.

మూడవ రోజు కన్నుల పండుగగా జరిగిన చంద్రపట్నం……

శ్రీ శ్రీ శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరలో భాగంగా మూడవరోజైన మంగళవారం చంద్రపట్నం కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది.పసుపు కుంకుమ లతో అలంకరించి పంచవర్ణములతో వేసిన చంద్రపట్నం పై దక్షిణం దిక్కున లింగమంతుల స్వామి వారిని, ఉత్తరం దిక్కున మాణిక్యమ్మ దేవి ని కూర్చోబెట్టి కళ్యాణం జరిగే కార్యక్రమంలో భాగంగా యాదవ పూజర్లు శ్రీ లింగమంతుల స్వామి కళ్యాణం కథ ను, శ్రీ కృష్ణుడి చరిత్ర పై పాటలు పాడుతూ అంగరంగ వైభవంగా జరిపించారు.

నాల్గవ రోజు నెలవారం….

దేవరపెట్టే కేసారం తరలింపు.

శ్రీ శ్రీ శ్రీ లింగమంతుల స్వామి వారి ఐదు రోజుల జాతర లో భాగంగా నాల్గవ రోజు నెలవార పట్నం మీద శ్రీ లింగమంతుల స్వామి, చౌడేశ్వరి అమ్మవారికి సంప్రదాయ పద్దతిలో మెంతేబోయిన వెంకన్న,మున్నా సందీప్ బోనం ఎత్తుకొన్ని చెల్లించారు. తదుపరి అమ్మవారికి నైవేద్యంను యాదవ పూజార్లు సమర్పించారు.స్వామివారికి నాలుగు రోజులుగా
లక్షలాది మంది భక్తులు చెల్లించుకున్నారని వారికి దిష్టి తగలకుండా చౌడేశ్వరి అమ్మవారి ముందు జంతుపూజ చేయటంతో నెలవారీ ఘట్టం ముగిసింది. తదుపరి దేవరపెట్టెను దురాజ్ పల్లి నుండి శివ సత్తుల విన్యాసాలతో, బేరిల చప్పులత్తో, ఓలింగా… నామస్మరణాలతో యాదవ పూజారులు కేసారంకు తరలించారు.

ఐదవ రోజు మకరతోరణాలు ఊరేగింపు….

చివరిరోజు సూర్యాపేట పట్టణంలో యాదవ పెద్దలు మకర తొరణాలు ఊరేగించి వారి ఇంటి వద్దకు తీసుకెళ్లారు.ఖాసీంపేట యాదవ్ హక్కు దారులు పసిడి కుండలను తమాగ్రామానికి తరలించడటంతో ఐదు రోజుల పాటు జరిగిన జాతర ముగిసింది.