

జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణ జానపద గేయాలు మరియు లంబాడి వేషధారణలతో నృత్యాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడ్డం రాజేశ్ రెడ్డి ఉపాధ్యాయ బృందం ఏఐపిసి కమిటీ సభ్యులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన విజయ స్ఫూర్తి కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాలలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో అశోక్ .విశిష్ట అతిథులుగా ఎంఈఓ రాములు. జక్రాన్ పల్లి ఎంఈఓ శ్రీనివాస్. ఎంపీ ఓ తారాచంద్. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సతీష్ ,శ్రీకాంత్ ,రాజేశ్వర్. వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. డిఇఓఅశోక్. మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని అదేవిధంగా ఈ సంవత్సరం పరీక్షల్లో చేసినటువంటి మార్పులను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఎం ఈ ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలపై భయం తొలగించుకొని చదవాలని తెలియజేయడం జరిగింది. వ్యక్తిత్వ వికాస నిపుణులు వజ్జ మహేందర్ మాట్లాడుతూ ఒక వ్యక్తీ ఎదుగుతుంటే ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడుతారని వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లినట్లయితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోగలమని వివరించారు. చీమన్ పల్లి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గణితం సుధాకర్ భౌతిక శాస్త్రం,అరవింద్. ఆంగ్లం సబ్జెక్ట్ లో విద్యార్థులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసి పిల్లలు సులభంగా చదువుకునేటువంటి విధానాన్ని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం రాజేష్ రెడ్డి& ఉపాధ్యాయ బృందం మరియు ఏ ఏ పీ సి. కమిటీ సభ్యులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.