

జనం న్యూస్. ఫిబ్రవరి 20. మెదక్ జిల్లా. నర్సాపూర్. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి వి రాజు సాంకేతిక విద్య సంస్ధ (బి వి ఆర్ ఐ టి) కళాశాలలో జాతీయ ఈ బాహా సే ఇండియా 2025 పోటీలు హాట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి సారి 2024 లో బి వి రాజు సాంకేతిక విద్య సంస్థ నిర్వహించగా అద్భుతమైన ఉత్తమ ఫలితాలు సాధించినందుకు 2025 రెండొవ సారి నిర్వహించే అవకాశం బి వి రాజు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కి దక్కిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే. ఆనందం వ్యక్తం చేశారు నేషనల్ ఈ బహా సే ఇండియా 2025 పోటీలకు నలుమూలల నుండి శక్తి ప్రతిభతో సందడి చేస్తూ ముందుకు సాగుతుందన్నారు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం పాల్గొనే వారందరికీ గొప్ప అవకాశాలను ఉజ్వల భవిష్యత్తును తీసుకువస్తుందని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేసిన కె వి విష్ణు రాజు ఛైర్మన్ శ్రీ ఆదిత్య విస్సం .సెక్రటరీ దేశ నలుమూలల నుండి వచ్చినఈ బాహ పోటీలలో పాల్గొంటున్న విద్యార్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు.రవి చంద్రన్ రాజ్‌గోపాల్ వైస్ చైర్మన్ సేవ్స్ 20 రాష్ట్రాల నుండి వచ్చిన బృందాలను స్వాగతించారు. వారి అభిరుచిని నేర్చుకోవడానికి భవిష్యత్తు కోసం ప్రేరణ పొందడానికి ఇదే సరైన వేదిక అని అన్నారు. మిస్టర్ మయాంక్ డింగ్రా, అసిస్టెంట్ ఎడిటర్ ఆటోకార్ ప్రొఫెషనల్, ఆటోమొబైల్ పరిశ్రమలో తన ప్రయాణంతో యువకులకు స్ఫూర్తినిచ్చాడు. ఈ కార్యక్రమాల నుండి నేర్చుకున్న అనుభవం వారిని చాలా దూరం తీసుకువెళుతుంది అన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ మెగా కార్యక్రమంలో ఎన్ఐటి లు ఐఐటిఎస్, విశ్వవిద్యాలయాలు కళాశాలల నుండి వచ్చే భారతదేశం నలుమూలల నుండి 15 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 80 కంటే ఎక్కువ బృందాలు పాల్గొంటున్నారని తెలిపారు.వివిధ రాష్ట్రాల నుండి 80 మంది టీం బృందాలు పాల్గొంటున్నాయని తెలిపారు . ఆంధ్రప్రదేశ్ 2. మహారాష్ట్ర 23. తమిళనాడు17. తెలంగాణ 2. కేరళ 7. ఢిల్లీ1. ఒడిశా 2. మధ్యప్రదేశ్ 5. ఉత్తర ప్రదేశ్ 3. ఖండ్1.
తిరుపుర.1. కర్ణాటక 4. చత్తీస్గడ్ 1. చతిస్గడ్-1. ఝార్ఖండ్ 1. జమ్మూ అండ్ కాశ్మీర్ 1. హర్యానా.1 నుండి జట్టులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే. కాంతారావు. శ్రీనివాస్ రెడ్డి. సురేష్. అశోక్ రెడ్డి. బాపిరాజు. మల్లికార్జున్. తదితరులు పాల్గొన్నారు.
