

జనం న్యూస్ జనవరి 11 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)
శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల స్థానిక బస్టాండ్ ఆవరణంలో నూతనంగా నిర్మిస్తున్న వడ్డే ఓబన్న విగ్రహం వద్ద గోరంట్ల మండలం వడ్డెర్ల సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు వడ్డెర సంఘం నాయకులు బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు వడ్డే ఓబన్న చేసిన సేవలను కొనియాడారు
ఈ కార్యక్రమానికి గోరంట్ల మండల అధ్యక్షుడు కడపరామాంజనేయులు, శ్రీనివాస్ వడ్డీ,కుంచపుఅమర్నాథ్, గాలిశ్రీనివాసులు ,వెంకటేష్ మేస్త్రి, ట్రాక్టర్ వెంకటేష్,వడ్డీ అంజినప్ప, శిరగవాండ్లపల్లివెంకటరాముడు, ఆనంద్, మహేష్, రామాంజనేయులు,కమ్మలవాండ్లపల్లి నాగేంద్రగంగాధర్,రఘు,వెంకట్రాంపల్లినారాయస్వామి, గంగులప్పా, మదన, కోరేవాండ్లపల్లి అంజనప్ప మరియు కొండ్రెడ్డిపల్లి, శ్రీనివాస్, మరియు గోరంట్ల మండల వడ్డెర కులస్తులు పాల్గొన్నారు