Listen to this article

జనం న్యూస్ 21 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రోస్టర్ క్లియర్ చేసి గ్రూప్- 2 మెయిన్స్ నిర్వహించాలని సింధు రీడింగ్ హాల్ వద్ద భారత ప్రజాతంత్ర యువజన సమస్య( DYFI ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా DYFI జిల్లా కన్వీనర్ ch .హరీష్ మాట్లాడుతు.ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ APPSC GROUP-2 నోటిఫికేషన్ ను 7 డిసెంబర్ 2023 లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ ను డిసెంబర్ చివరి వారంలో విడుదల చేశారు. నోటిఫికేషన్ లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడంపై రోస్టర్ పాయింట్లు తప్పులు ఉన్నాయని, రోస్టర్ పాయింట్లు సరిదిద్దాకే ప్రాధమిక పరీక్ష నిర్వహించాలని APPSC ని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టులో జారీ చేసిన G.o no. 77 కు విరుద్ధంగా రోస్టర్ పాయింట్లు కేటాయించారు. APPSC అభ్యర్ధుల యొక్క ఆవేదనను పట్టించుకోకుండా 25 ఫిబ్రవరి 2024 న ప్రాధమిక పరీక్షను నిర్వహించింది. ప్రధాన పరీక్షను పలు సార్లు వాయిదా వేసుకుంటూ చివరికి 2025 ఫిబ్రవరి 23 వ తేదీన నిర్వహించడానికి APPSC సిద్ధం అయింది. అభ్యర్థులు గౌరవ హైకోర్టును ఆశ్రయించారు. కేసు నెం. WP/4633/2024, WP/15202/2024. గౌరవ కోర్టు తీర్పు పెండింగ్ లో ఉన్నది. APPSC ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్-2 ప్రధాన పరీక్షలను నిర్వహించడానికి సిద్దం అయింది. రోస్టర్ తప్పుల వలన సుమారు 90 వేలమంది మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులకు ఆందోళనకు గురి కాకుండా రోస్టర్ తప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన హామీ ఇచ్చేలా ఇంతవరకు ప్రకటన జారీ చేయలేదు. రోస్టర్ తప్పులను సరి చేయకుండా గ్రూప్-2 ప్రధాన పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులకు తీవ్రమైన నష్టం వస్తుంది మరియు మరలా న్యాయపరమైన వివాదాలు వస్తాయి. కావున రోస్టర్ లో నెలకొన్న తప్పులను సవరించి, మరలా అభ్యర్థులకు ఎటువంటి న్యాయపరమైన వివాదాలు రాకుండా గ్రూప్-II ప్రధాన పరీక్షలు నిర్వహించాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఉపాధ్యక్షులు b. సతీష్ , నాయకులు పాపారావు, సిద్ధార్థ, భాస్కర్ రావు, నిరుద్యోగ యువత 100 మంది పాల్గొన్నారు…