

జనం న్యూస్ 21 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మసీదులలో పనిచేస్తున్న ఇమామ్ మౌజాన్‌లకు గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలతో సహా సీఎం చంద్రబాబు విడుదల చేసారని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో మైనారిటీలకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.