Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్
మెగాస్టార్‌ చిరంజీవి, కుటుంబానికి ఊహించని షాక్‌ తగిలింది. మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనా దేవి,అస్వస్థత గురయ్యా రు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మెగా స్టార్ చిరంజీవి తల్లి కొణి దెల అంజనా దేవి, అస్వస్థ తకు గురైనట్లు సమాచారం. ఈ తరుణంలోనే… మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనమ్మను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనమ్మ కు హై బీపీ వచ్చినట్లు చెబుతు న్నారు. గత కొన్ని రోజు లుగా అనారోగ్య సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తుంది…ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.