

జుక్కల్ ఫిబ్రవరి 21 జనం న్యూస్ ( జుక్కల్ కానిస్టేసన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. బిచ్కుంద మండలం లో వాజిద్నగర్, గుండెనమల్లీ గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టబద్రుల ఓటర్లను కోరడం జరిగింది. పట్టభద్రులతో ఎలక్షన్ గురించి మరియు అభివృద్ధి చెందుతున్న పథకాల దృష్ట్యా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి పి సి సీ డెలిగేటు విట్టల్ రెడ్డి కాగ్రెస్ మండల అధ్యక్షులు దర్పల్ గంగాధర్, ఉపాధ్యక్షులు రవి పటేల్, మార్కెట్ డైరెక్టర్ సాయిని అశోక్, మాజీ సర్పంచ్ రామరెడ్డి మరియు వీర్రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.