

జనం న్యూస్ // ఫిబ్రవరి // 21//జమ్మికుంట // కుమార్ యాదవ్.. వీణవంక మండలం కోర్కల్ గ్రామము నిరుపేద కుటుంబానికి చెందిన ఎండి,రిజ్వానా వివాహం ఈనెల 23వ తేదీ ఆదివారం రోజు ఉండగా ,ఈ వివాహానికి గ్రామంలోని కొంతమంది దాతల సహకారంతో వివాహం చేస్తున్నారని , ఈ విషయాన్ని కొర్కళ్ గ్రామస్తులు రాకేష్ రెడ్డి కి తెలుపగా, తన యువ సైన్యం 75 కిలోల బియ్యాన్ని అందజేశారు. రిజ్వాన తండ్రి ఇబ్రహీం గత ఐదు సంవత్సరాల క్రితం చనిపోయాడు,నిరుపేదరికంలో కుటుంబం జీవనం సాగిస్తున్నారు. ఈ పేద కుంటుంబానికి అండగా నిలిచినా రాకేష్ రెడ్డి యూవ సైన్యం కీ రిజ్వనా కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లొ రాకేష్ రెడ్డి యువ సైన్యం వేవస్థాపకులు పోతరవేన సతీష్ కుమార్, మల్లారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, మర్రి కుమార్, పల్లెర్ల కిరణ్, మద్దుల ప్రశాంత్,విద్యాసాగర్, చిలివేరి రమేష్, ఎండి షాబుద్దీన్, తిరుపతి,రాకేష్, రాజలింగు, మునీర్, అంకుష్,సమ్మయ్య, బొడిగె బీరయ్య, శివ, మహమ్మద్, అజారుద్దీన్, జగన్ తదితరులు పాల్గొన్నారు.