

జనం న్యూస్ ఫిబ్రవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజక వర్గం వివేక్ నగర్ డివిజన్ నివాసం ఉంటున్న వనరస.యాదగిరి తండ్రి వి.సీతారాములు వయస్సు యాబై సంవత్సరాలు, మొకాళ్ళ నొప్పితో పంజాగుట్ట లోని నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వైద్యులు మోకాలికి బైపాస్ సర్జరీ చేయవలసిందిగా సూచించారు.వారి మనవరాలు కూకట్పల్లి లోని గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కార్యాలయంలో సంప్రదించగా కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిది కి అప్లై చేయించగా వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా యల్ ఒ సి ఒక లక్ష యాభై వేల రూపాయలు మంజూరు అయినవి ఆ యల్ ఒ సి లెటర్ ను కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వేంకటేశ్వర రావు చేతుల మీదగా యాదగిరి మనవరాలు రీతు కి అందించడం జరిగింది
ఈ సందర్భంగా రీతు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కి బండి రమేష్ కి గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కి కృతజ్ఞతలు తెలియజేశారు.