

జనం న్యూస్ ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి .కృష్ణారావు ఆదేశాల ప్రకారం అమలాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టీ. యస్. ఆర్.కె.ప్రసాద్ మరియు ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ పర్యవేక్షణలో కాట్రేనికోన ఎస్సై అవినాష్ పల్లం జడ్పీ హై స్కూల్ స్కూలు నందు రోడ్ సేఫ్టీ అవగాహన,మహిళ సంరక్షణ, మహిళా చట్టాల మీద అవగాహన,డ్రగ్స్ దుర్వస్యనాలు వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాల మీద అవగాహన , గుడ్ టచ్ బ్యాడ్ టచ్,బాలల మీద లైంగిక వేధింపులు,బాలికల, మహిళల ,భద్రత గురించి విద్యార్థిని విధ్యార్థులకు లకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాట్రేనికోన మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఐ అవినాష్ మరియ అల్లం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం వారి సిబ్బంది పాల్గొన్నారు