Listen to this article

ఫిబ్రవరి 21 జనం న్యూస్. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ మండలంలో. బీజేపీ
ఎమ్మెల్సీ అభ్యర్తుల గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆధ్వర్యంలో కార్యకర్తలకు ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి అవగాహన కల్పించారు మండలం లో ఈరోజు కొన్ని గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి. సి అంజిరెడ్డి మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టబద్రుల ఓటర్లను కోరడం జరిగింది. పట్టభద్రులతో ఎలక్షన్ గురించి మరియు అభివృద్ధి చెందుతున్న పథకాల దృష్ట్యా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు. పాల్గొనడం జరిగింది. అలాగే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి. మల్క కొమురయ్యను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. బిజెపి కార్యకర్తలు అందరూ కష్టపడి ఇద్దరు అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిపించి. ఇందూరు సత్తా చాటాలని పిలుపునిచ్చారు.