

ఎంపీడీఓ సత్తయ్య,
జనం న్యూస్,ఫిబ్రవరి 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులను శుక్రవారం ఎంపీడీఓ సత్తయ్య, ఏపీఓ నరసింహా తో కలిసి పనులు నిర్వహిస్తున్న స్తవరానికి ఆకస్మికంగా వెళ్లి జాతీయ ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డ్ నెంబర్లను పరిశీలించారు. ప్రతిరోజు ఉపాధి హామీ కూలి ప్రతి ఒక్కరూ పొడవు ఒక్క మీటరు వెడల్పు మీటర్నరా, రాళ్ల తేట్టే పేరించాలని ఉపాధి హామీ కూలీలను దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ ఇచ్చిన మెజర్మెంట్, కొలతల ప్రకారం పని చేసినట్లయితే 300 రూపాయలకు తగ్గకుండా డబ్బులు పడతాయని అన్నారు. వేసవి ఎండలు ఎక్కువ అవ్వడం వల్ల ప్రొద్దున 9 గంటలలోపు పని స్థలానికి చేరుకొని ఎండ అవకముందు తిరిగి వెళ్ళిపోవచ్చు అని అన్నారు.తడ్కల్ గ్రామంలో పనికి వచ్చిన వారికి మాత్రమే హాజరు వేస్తున్నారని ఇక్కడ ఎటువంటి అవకతవకలకు జరగనివ్వకుండా సజావుగా కొనసాగుతున్నాయని అన్నారు. 220 మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు రవీందర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ విష్ణు దాస్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.