Listen to this article

జనం న్యూస్ 21 ఫిబ్రవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మాటుగూడెం గ్రామానికి చెందిన శివ స్వాములు శ్రీశైలం బయలుదేరడం జరిగింది. ప్రతి ఒక్కరూ దైవసింతన కలిగి ఉండాలని గురుస్వామి శ్రీ భూపాల్ చారి స్వామి అన్నారు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో శివస్వాములు 41 రోజుల పాటు దీక్ష చేశారు. శుక్రవారం ప్రత్యేక పూజలు ఉదయం నుంచి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇరుముడి కట్టుకుని గ్రామంలో ఊరేగింపు నిర్వహించి, శ్రీశైలానికి బయలు దేరారు. ఇరుముడి కట్టిన తరువాత దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు, కృష్ణ గురుస్వామి, రమేష్ గురుస్వామి, నవీన్ గురుస్వామి, నితిన్ స్వామి, ప్రణీత్ స్వామి, నవీన్ స్వామి, ప్రవీణ్ స్వామి నరేందర్ స్వామి,  మరియు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.