

జనంన్యూస్. 21. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు ఖలీల్ వాడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఓల్డ్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. హాజరు కావడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి గెలిచినాక రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు గాలికి వదిలి రిటైర్డ్ బినిఫిట్స్ కూడా సరిగా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఒకవైపు నిరుద్యోగతతో యువత ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లకు పరిమితం అవుతుంటే మరో వైపు రిటైర్మెంట్ కాల పరిమితి పెంచుతు ఉద్యోగులపైన భారం పెంచుతుందన్నారు.రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. 317 జీవోతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఉద్యోగుల పక్షాన 317 జీవోకు వ్యతిరేకంగా బిజెపి ఉద్యమం చేపడితే అరెస్తులు, లాఠీ ఛార్జ్ లు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. 6వేల కోట్ల పైచిలుకు ఫీ రేంబర్స్మెంట్ బకాయిల కారణంగా నేడు పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక హామీలు,గ్యారంటీలు, డిక్లరేషన్లు ఇచ్చి ఒక్కటి కూడా అమలుచేయకుండా యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు, ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఏమైపోయాయి అని ప్రశ్నించారు, నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి ఇచ్చాకే పట్టభద్రులను ఓటు అడగాలని డిమాండ్ చేసారు. కాంగ్రెస్ చీకటి పాలనకు బుద్ది చెప్పాలంటే మేధావులు అంత ఏకం కావాలని ప్రశ్నించే గొంతుకులైన పట్టభద్రుల ఎమ్మెల్సి అభ్యర్థి అంజిరెడ్డి కి , ఉపాధ్యాయ ఎమ్మెల్సి అభ్యర్థి మల్కా కొమురయ్య కు.మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమలోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, సెక్రటరీ భోజగౌడ్, ట్రెజరర్ ఆశయ్య, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.