

బిచ్కుంద ఫిబ్రవరి 21 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (A) నందు తృతీయ సంవత్సర విద్యార్థిని, విద్యార్థులకు డిగ్రీ అనంతరం ఎంచుకునే అంశంపై ప్రముఖ కెరియర్ గైడెన్స్ వక్త బి. శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ గారిచే కళాశాల ఐ క్యు ఏ సి మరియు ప్లేస్మెంట్ విభాగం వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలను పెంచుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని కళాశాల ప్రిన్సిపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ డాక్టర్ జి.రమేష్ బాబు, ప్లేస్మెంట్ సెల్ డా.టి.అశోక్ రావు మరియు కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.